నోకియా5.4 4జి స్మార్ట్ మొబైల్

నోకియా5.4 4జి స్మార్ట్ మొబైల్

నోకియా5.4 4జి స్మార్ట్ మొబైల్ ఫీచర్లు ఈ పోస్టులో… నోకియా అంటే ఫోన్లలో మొదటి బ్రాండుగా ప్రసిద్ది.

స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగాక వెనకబడి మరలా పోటీకి సిద్దమైన నోకియా నుండి మరొక నోకియా5.4 4జి స్మార్ట్ మొబైల్ 4జిబి రామ్ కలిగి రూ.13,999/- లలో ఆన్ లైన్లో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

బుడ్జెట్ ధరలో బ్రాండెడ్ సంస్థ నుండి ఫోన్ అంటే దాని ఫీచర్లు తక్కువగానే ఉంటాయి… ఇతర బ్రాండ్లతో పోల్చితే ఈ ఫోన్ డిస్ప్లే విషయంలో రాజీ పడాలి. మిగిలిన ఫీచర్లు మాత్రం బాగానే ఉన్నప్పటికి డిస్ప్లే డెన్సిటీ తక్కువగా ఉండి, ఐ‌పి‌ఎస్ డిస్ప్లే తో వస్తుంది.

ఇందులో ఫోన్ మెమొరీ 64జిబి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కావాలంటే మెమొరీ 512జిబి వరకు పెంచుకోవచ్చు.

ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ నానో సిమ్స్, వోల్టే, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో, వైఫై, 30ఫ్రేమ్స్ తో వీడియో రికార్డింగ్, ఎల్‌ఈ‌డి ఫ్లాష్, ఆండ్రేనో 610 గ్రాఫిక్స్, ఆండ్రాయిడ్ 10 వెర్సన్, ఇంకా సెన్సార్స్ Light sensor, Proximity sensor, Accelerometer, Gyroscope అందిస్తున్నారు.

ఈ నోకియా ఫోన్ పెర్ ఫార్మెన్స్ కోసం ఆక్టా కోర్ 2 గిగా హెడ్జెస్ స్పీడ్ ఉండే విధంగా స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 4జిబి రామ్, 6జిబి రామ్ వేరియంట్లలో నోకియా 5.4 ఫోన్స్ లభిస్తున్నాయి.

ఫోన్ డిస్ప్లే మాత్రం 6.39 అంగుళాల తాకే తెర కలిగి 269 పిక్సెల్ డెన్సిటీతో లభిస్తుంది. ఐ‌పి‌ఎస్ డిస్ప్లే 720 x 1560 రిజల్యూసన్ కలిగి ఉంటుంది.

48మెగా పిక్సెల్ బాక్ సైడ్ మెయిన్ కెమెరాతో బాటు మరో మూడు కెమెరాలు 5+2+2 మెగా పిక్సెల్ క్వాలిటీ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ 16 మెగా పిక్సెల్ కెమెరా కలదు.

4000ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన నోన్ రిమోవబుల్ బ్యాటరీ కలదు. టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు.

ఈ ప్రైస్ రేంజ్ లో మరొక రెండు వేలు పెడితే ఇతర బ్రాండ్ల ఫోన్స్ బెట్టర్ ఫీచర్లు ఉంటాయి.